Restricted temples for men: మగవాళ్లకి నో ఎంట్రీ.. ఈ ఆలయాల గురించి తెలుసా?

Restricted temples for men

Restricted temples for men

Restricted temples for men: మహిళలను అనుమతించని దేవాలయాల గురించి చాలా మంది విన్నారు. అయితే మగవారికి ఎంట్రీ లేని ఆలయాల గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు.

Restricted temples for men: మహిళలను అనుమతించని దేవాలయాల గురించి చాలా మంది విన్నారు. అయితే మగవారికి ఎంట్రీ లేని ఆలయాల గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. అవి కూడా మన దేశంలోనే ఉన్నాయి. అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది నిషేదం.. మగవాళ్ళు రాకుండా ఉండేదుకై ఆలయాల ప్రాంగనంతో గార్డ్స్ చాలా స్ట్రిట్ గా కాపలా కాస్తుంటారు. మగవారిని అనుమతించని ఆలయాలా? అని ఆశ్చర్య పోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం?

1. చక్కులాతుకవు దేవాలయం


కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.

2. సంతోషి మాత ఆలయం


సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వరు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు. సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.

3. అట్టుకల్‌ దేవాలయం



కేరళ రాష్ట్రంలోనే తిరువనంతపురం సమీపంలోనిమరో దేవాలయం అట్టుకల్‌ దేవాలయం ఈ గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.

4. భాగతీ మాత ఆలయం

మాతా ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ పూర్‌ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారికి ప్రవేశం లేదు. దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.. దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

5. బ్రహ్మ దేవుని ఆలయం


జస్థాన్ లోని పుష్కర్ లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. ఈ ఐదు దేవాలయాల్లో మగవారికి ప్రవేశం లేదు.

Tags

Next Story