TTD : నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు

TTD : నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు
X

నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో రూ.4.06 కోట్ల హుండీ ఆదాయం చేకూరింది.

Tags

Next Story