Shabarimala : అయ్యప్ప బంగారు లాకెట్ల విక్రయం

Shabarimala : అయ్యప్ప బంగారు లాకెట్ల విక్రయం
X

భక్తులకు శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. అయ్యప్ప విగ్రహంతో కూడిన ప్రత్యేక బంగారు లాకెట్ ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మలయాళ నూతన సంవత్సరం విషు సందర్భంగా ఈ లాకెట్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. బుధవారం జరిగిన ట్రావెన్కోర్ దేవస్థానం పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.1, 2, 4, 6, 8 గ్రాముల్లో లాకెట్లు అందుబాటులో ఉండనున్నాయి. తమిళనాడుకు చెందిన జీఆర్టీ కేరళకు చెందిన కళ్యాణ్ సంస్థలు లాకెట్లను తయారుచేశాయని పేర్కొంది. అయ్యప్ప భక్తులు లాకెట్లను రెండు విధాలుగా కొనుగోలు చేయవచ్చని దేవస్థానం ద్వారా ఆన్ లైన్ లేదా ఆలయ ప్రధాన ప్రాంతమైన సన్నిధానంలోని దేవస్వం పరిపాలనా కార్యాలయంలో నగదు చెల్లించడం ద్వారా పొందవచ్చని తెలిపింది. లాకెట్ను దాన్ని ఆలయ పవిత్ర గర్భగుడి లోపల పూజలు నిర్వహించి అందజేస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులకు అదనపు ప్రత్యేకతను ఇస్తుందని దేవస్థానం తెలిపింది. లాకెట్ల అమ్మకాల నుండి వచ్చే మొత్తంలో నిర్ణీత శాతం దేవస్థానం ఖాతాలోకి వెళ్తుందని పేర్కొంది. బంగారం లాకెట్లను దేవస్థానం తయారు చేయడం లేదని అందువల్ల హైకోర్టు అనుమతి అవసరం లేదని పేర్కొంది. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ సభ్యుడు అజికుమార్ మాట్లాడుతూ.. విషుకే సందర్భంగా లాకెట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కొత్త లాకెట్ అయ్యప్ప భక్తులకు ఒక "ఆలోచనాత్మక విషు బహుమతి అని, విశ్వాసాన్ని వారు ధరించడం ఎంతో ఆదరించగల స్మారకచిహ్నంతో మిళితం చేస్తుందన్నారు.

Tags

Next Story