Sabarimala : శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం

Sabarimala : శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం
X

శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజించిన లాకెట్ల విక్రయాలను నిన్నటి నుంచి మొదలెట్టింది. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ ధర రూ,19,300, 4 గ్రాములైతే రూ.38,600, 8గ్రా. లాకెట్ ధరను రూ.77,200గా నిర్ణయించినట్లు దేవస్థానం తెలిపింది. కాగా తొలి లాకెట్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఏపీ భక్తుడికి అందజేశారు. కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ పవిత్ర విషు పర్వదినం సందర్భంగా సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tags

Next Story