Sravana Maasam : శ్రావణమాసం నో నాన్‌వెజ్.. సైంటిఫిక్ రీజన్ ఇదే

శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ చాలా మంది ఈ నెలలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి పలు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇటు సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
ఈ రోజుల్లో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున శ్రావణంలో ఎక్కువ సాధారణ ఆహారాన్ని తినమని సలహా ఇస్తారు వైద్యులు.. వర్షాకాలంలో గాలి, నీరు, ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆహారంలో స్వల్ప భాగం కూడా ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియాకు కారణం అవుతుంది. అయితే, నాన్ వెజ్‌ను ధృడమైన ఆహారంగా పరిగణిస్తారు, ఇది సులభంగా జీర్ణం కాదు. ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఎసిడిటీ, కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు-విరేచనాలు మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరోవైపు.. ఆయుర్వేదం ప్రకారం శ్రావణంలో మద్యం మరియు మాంసాన్ని వదిలివేయాలి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. ఈ నెల మొత్తంలో తరచుగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, అలాంటప్పుడు మాంసాహారం మరియు స్పైసీ ఫుడ్ వల్ల వ్యాధులు వస్తాయని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com