TTD : తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

TTD : తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
X

తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టు‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా, వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో.. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.

తిరుమలలో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. రెండు మహోత్సవాలు ఒకేరోజు కలిసి రానున్నాయి. ఇందులో పాల్గొనే అవకాశం అశేష భక్తజనానికి కలిగింది. ఈ రెండింటినీ విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు.

Tags

Next Story