Kumbh Mela : తెలంగాణ నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళా-2025పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతోందన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా జరుగనుందని తెలిపారు. 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఆరు పుణ్య దినాల్లో గంగానదిలో పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారని వెల్లడించారు. జనవరి 13, 14, 29 తేదీల్లో ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగా నదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం వస్తుందన్నారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపేందుకు ఉద్దేశించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కిషన్రెడ్డి తెలిపారు. కొముర వెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద నూతన రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శంఖుస్థాపనచేశామన్నారు. ఈ పనులకు సంబంధించిన విషయాలను ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com