Srisailam : శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

Srisailam : శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
X

ఇవాళ్టి నుంచి పవిత్ర శ్రావణ మాసం మొదలైంది. దీంతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 24 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు, రద్దీ రోజుల్లో అభిషేకాలను ఆలయ అధికారులు రద్దుచేశారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు కొనసాగుతాయన్నారు. వచ్చే నెల 8, 22 తేదీల్లో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Tags

Next Story