TTD : ఈ రాత్రితో ముగియనున్న శ్రీవారి వాహనసేవలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం శ్రీవారి మహారథోత్సవం జరుగుతోంది. రాత్రి అశ్వవాహన సేవతో వాహనసేవల ప్రక్రియ ముగియనుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రి మలయ్యప్పస్వామి చంద్రప్రభ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించారు. కాగా ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇచ్చాడు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు, అర్చకులు ఘనంగా చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. కాగా శ్రీనివాసుడు దర్బార్ కృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, గోవిందుని నామాస్మరణతో పులకితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com