Supreme Court : లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా.. లడ్డూలను టెస్టింగ్ కు పంపారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ జరిగిందని నిర్ధారించిన నెయ్యిని లడ్డూలో వినియోగించారా లేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలా వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. శాంపిళ్లను ఎక్కడి నుంచి సేకరించారు.. రెండో అభిప్రాయం తీసుకున్నారా లేదా అని ధర్మాసనం అడిగింది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో రాజకీయాలు సరికాదని తెలిపింది. తిరుమల నెయ్యి విషయంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 18న సీఎం చేసిన ప్రకటనకు ఆధారం లేదు.. ఆ నెయ్యి వాడలేదని టీటీడీ చెబుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని.. కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com