Lord Shiva : శివుడి మాదిరే మనకూ మూడో కన్ను.. శివ అంటే అర్థం ఇదే !

మనుషులకు మూడో కన్ను అంటే శివుడి మాదిరి నుదుటిపై ఉంటుందని కాదు. భౌతికం కానివాటిని చూడగలగడం, అంతర్ముఖులం కావడం అని అర్థం. కర్మ స్మృతుల కారణంగా మానవుడు దేన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడలేడని, అలా చూసేందుకు లోతులకు చొచ్చుకుపోగలిగే, జ్ఞాపకాలతో కలుషితం కాని ఓ కన్ను కావాలని పండితులు చెబుతారు. అంతర్ దృష్టి ఏర్పడినప్పుడు మనలోని స్పష్టతను ప్రపంచంలో ఏదీ చెదరగొట్టదు. అదే జ్ఞానంతో కూడిన నిజమైన మూడో కన్ను.
శివ పదమణి మాల ప్రకారం శి అంటే శివుడు. వ అంటే శక్తి అని అర్థం. శివ అంటే శుభపద్రం, మంగళకరం, శ్రేయస్కరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి వేళ ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. స్పటిక లేదా వెండి లింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com