Tiruchanur Karthika Brahmotsav : తిరుచానూరులో గజవాహనంపై ఊరేగిన వైభోగం

Tiruchanur Karthika Brahmotsav : తిరుచానూరులో గజవాహనంపై ఊరేగిన వైభోగం
X

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags

Next Story