TTD : తిరుమల షాపింగ్ కాంప్లెక్స్‌లో దొంగతనాలు

TTD : తిరుమల షాపింగ్ కాంప్లెక్స్‌లో దొంగతనాలు
X

పవిత్ర క్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీని అవకాశంగా మలుచుకుంటూ, కొంతమంది అనధికారికంగా వ్యాపారాలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తిరుమల షాపింగ్ కాంప్లెక్స్‌లో ఇటీవల రాత్రి సమయంలో వరుస దొంగతనాలు జరుగుతుండగా, ఎట్టకేలకు ఓ దుకాణ యజమాని చాకచక్యంతో వారిని పట్టుకో చేయగలిగారు. దుకాణ యజమాని అనుమానం వచ్చిన తర్వాత తన షాపులో మరియు పక్క షాపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, రాత్రివేళల్లో భక్తుల వేషధారణలో వచ్చిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు కనిపించాయి అని దుకాణ యజమాని తెలిపారు స్థానిక భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చిన వెంటనే, వారు తక్షణమే స్పందించి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు అనధికారికంగా తిరుమలలో నివసిస్తూ, భక్తుల తరహాలో దుకాణాల్లో సంచరిస్తూ వస్తువులు అపహరిస్తున్నట్లు తెలిసింది.

Tags

Next Story