TTD : తిరుమల శ్రీవారికి జులైలో భారీగా హుండీ ఆదాయం..

TTD : తిరుమల శ్రీవారికి జులైలో భారీగా హుండీ ఆదాయం..
X

తిరుమల శ్రీవారిని జులై నెలలో 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.125 కోట్లు లభించిందన్నారు. అలాగే 1.04 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15-17 మధ్య పవిత్రోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య విజ్ఞప్తి చేసింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు నిర్దేశించిన సమయంలో మాత్రమే క్యూ లైన్లలోకి రావాలని సూచించింది. కేటాయించిన సమయం కంటే ముందుగా వచ్చిన వారిని క్యూ లైన్లలోకి అనుమతించరని తెలిపింది. భక్తులు గమనించి సహకరించాలని కోరింది.

వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూ. ఎవరైనా తిరుమల వెళ్లొస్తే ముందుగా అడిగేది దీనినే. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నిన్నటికి ( ఆగస్టు 02)వ తేదీకి 308 ఏళ్లు పూర్తైంది. 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.

Tags

Next Story