Tirupati Laddu : తిరుపతి లడ్డూ తయారీపై ప్రచారం ఫేక్ : టీటీడీ

Tirupati Laddu : తిరుపతి లడ్డూ తయారీపై ప్రచారం ఫేక్ : టీటీడీ
X

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీని థామస్ అనే కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. శ్రీవారి లడ్డూ తయారీలో ప్రస్తుతం 980 మంది హిందువులు పాల్గొంటున్నారని తెలిపింది. లడ్డూను కొన్ని శతాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది.

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారు.

వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Tags

Next Story