TTD : తిరుమల శ్రీవారి సేవకులకు శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవకు వచ్చే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకోవాలని తిరుమల టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కోరారు. టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీవారి సేవకు సంబంధించిన నూతన మాడ్యూల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ.. శ్రీవారి సేవలో పలు సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు. అలాగే ప్రొఫెషనల్స్, ఎన్‌ఆర్‌ఐలు కూడా సేవలో పాల్గొనేందుకు త్వరలో ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు.
టీటీడీ ఈవో జె. శ్యామలరావు మాట్లాడుతూ.. ఇటీవల తిరుమలలో జనతా క్యాంటీన్ల టెండర్లను గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ఈ ప్రక్రియను వీడియో తీసి రికార్డు చేశామన్నారు. తిరుమలలో రోజుకు సగటున నాలుగు లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంటే, అంతే స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com