TTD : చరిత్రలో నిలిచేలా టీటీడీ నిర్ణయాలు..!

TTD : చరిత్రలో నిలిచేలా టీటీడీ నిర్ణయాలు..!
X

ప్రస్తుత టీటీడీ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో అత్యుత్తమంగా నిలిచేలా ఉన్నాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే ఫ్యూచర్ లో తిరుమల క్షేత్రం మరింత ఆధ్యాత్మికంగా, మౌలిక వసతులపరంగా అత్యుత్తమంగా ఉండేలా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చర్యలు చేపడుతున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఏఐ టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టీటీడీ టికెట్ల కేటాయింపుతో పాటు దర్శనాలు, మౌలిక సదుపాయాలు, భద్రతాపరమైన విషయాలు, ఇతర సాంకేతిక విషయాల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. టీటీడీ సమక్షంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా భక్తులందరికీ ప్రశాంతంగా దర్శనమయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వైసీపీ హయాంలో ఇలాంటివి ఎన్నడూ కనిపించలేదు.

టీటీడీ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు కూడా సానుకూలంగా వ్యాఖ్యలు చేసింది. వైసిపి హయాంలో టీటీడీనీ ఆ పార్టీ నేతలు అక్రమాలకు వాడుకున్నారు. పరకామణి, కల్తీ నెయ్యి కేసు, పట్టు శాలువాల కేసులు ఇప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. అతిపెద్ద కుంభకోణాలు టీటీడీలో చేసిన పాపం వైసిపి నేతలకే దక్కింది. కానీ జగన్ మాత్రం పరాకామణి చాలా చిన్న కేసు అని మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. కల్తీ నెయ్యి కేసు అంటే ఆయన దృష్టిలో అసలు లెక్కే లేనట్టు మాట్లాడుతున్నారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ పరువే పోతుంది కాబట్టి అదేదో కల్తీ నెయ్యి కేసు అన్నట్టు ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడటం జగన్ కు మాత్రమే చెల్లింది. బహుశా జగన్ దృష్టిలో హిందూ భక్తుల నమ్మకాలు అంటే అంత చిన్న చూపు కాబోలు.

కానీ ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భక్తుల నమ్మకాన్ని పెంచేలా, కల్తీ అన్న పదమే టీటీడీ దరిదాపుల్లో వినిపించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కల్తీని అరికట్టడం కోసం థర్డ్ పార్టీ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. టీటీడీలోకి వస్తున్న ప్రతి వస్తువును ఒకటికి పది సార్లు చెక్ చేశాక క్వాలిటీది అయితే మాత్రమే అనుమతిస్తున్నారు. మొన్ననే దివ్య వృక్షాలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా ఆలయాల ముందు ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేయబోతున్నారు. అటు ఏడుకొండల్లో అన్ని కాలాల్లో పచ్చదనం వెలివేరిసేలా ప్రాజెక్టులు చేపట్టారు. టీటీడీలో సామాన్య భక్తులకు అద్భుతమైన వసతులు ఏర్పాటు చేశారు. దర్శనాల విషయంలో రాజకీయ లీడర్లు, ప్రముఖులకు కాకుండా సామాన్య భక్తులకే ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే బీర్ నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Tags

Next Story