TTD : సామాన్య భక్తులకే ప్రాధాన్యత.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం.

టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో టీటీడీని ఎంత దారుణంగా తయారు చేశారో మనం చూశాం. అసలు సామాన్య భక్తులకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎంతసేపు వైసీపీ నేతలు తిరుమలకు వెళ్తే.. వారి వెంట మరో 20 మందిని తీసుకెళ్లి స్పెషల్ దర్శనాలు చేసుకునేవారు. వాళ్ల దర్శనాలు అయిపోయే దాకా సామాన్య జనాలు లైన్లలో నిలబడుతూ నానా ఇబ్బందులు పడ్డారు. అన్నదానం వద్ద, దేవుడి ఆలయం వద్ద, టీటీడీ పరిసరాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక బీఆర్ నాయుడు గారి సారథ్యంలో టీటీడీ ఎన్నో వసతులు కల్పిస్తోంది.
బీఆర్ నాయుడు హయాంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. వీటిపై తాజాగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. 182 గంటల ద్వారా దర్శన సమయంలో సామాన్యులకే పెద్ద పీట వేస్తామన్నారు. సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామని ప్రకటించారు. మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశామన్నారు.
జనవరి 2 నుంచి 8 వరకు రోజువారీ 1500 టికెట్లు, ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు కీలక ప్రాధాన్యత ఇస్తున్నామని.. వాళ్ల తర్వాతనే తమకు మిగతా వాళ్లు అంటూ తెలిపారు. దీంతో బీఆర్ నాయుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. వైవీ సబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఉండేదని.. సామాన్య భక్తులను కనీసం పట్టించుకున్న వారే లేరంటున్నారు. ఇప్పుడు సామాన్య భక్తుల కోసం బీఆర్ నాయుడు కల్పిస్తున్న వెసలుబాట్లు అద్భుతంగా ఉన్నాయని రీసెంట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

