TTD : ఏడుకొండల్లో వన వైభవం.. టీటీడీ కీలక నిర్ణయం

TTD : ఏడుకొండల్లో వన వైభవం.. టీటీడీ కీలక నిర్ణయం
X

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చినప్పుడు పచ్చదనాన్ని మరింత పెంచాలని సూచించారు. అన్ని కాలాల్లో పూల సువాసనలు వెదజల్లేలా ఏడుకొండలను మార్చాలని అభిప్రాయపడ్డారు. దీంతో చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చే పదేళ్లలో అంటే 2035 వరకు ఏడుకొండలకు వనవైభవం తీసుకువచ్చేలా కీలక పాలసీని రూపొందించారు. ఈ పదేళ్ల పాలసీకి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో నీటిని నిలువ చేయడం ప్రధాన లక్ష్యం.

అందుకోసం చెక్ డ్యాములు, కందకాలు నిర్మించాలని ఇందులో పొందుపరిచారు. దాని ద్వారా వాటర్ కిందకు పోకుండా చెట్లకు అంది పచ్చదనం పెరుగుతుంది. దీంతోపాటు వందల హెక్టార్లలో ఉన్న అకేసియా తోటలను తొలగించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇవి దేశీయ చెట్లను ఎదగనివ్వట్లేదు. అలాగే భూమి సారాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. వీటిని ఒకేసారి తొలగిస్తే కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి దశలవారీగా వీటిని తొలగించబోతున్నారు. వీటి స్థానంలో దేశీయ పూల మొక్కలతో పాటు ఇతర చెట్లను నాటబోతున్నారు. ఈ చెట్ల ద్వారా ఏడుకొండలు అన్ని కాలంలో పచ్చదనంతో విరజిల్లేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

2025 నుంచి 27 వరకు మొదటి దశలో చెక్ డ్యాములు, కందకాలు నిర్మించబోతున్నారు

ఆ తర్వాత 31 వరకు అకేసియా తోటలను దశలవారీగా తొలగిస్తారు. 35 వరకు మన దేశ చెట్లను నాటి వాటిని అద్భుతంగా పెంచబోతున్నారు. వచ్చే పది ఏళ్లలో ఏడుకొండలు అత్యంత పచ్చదనంతో భక్తులకు ఎల్లకాలం నీడనివ్వబోతున్నాయి. బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత తిరుమలలో అత్యద్భుతమైన వసతులు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీతో కూడిన పరిశుభ్రత మనకు తిరుమలలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఈ శేషాచలం కొండలను మరింత పచ్చదనంగా మార్చడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story