TTD EO Shyamala Rao : తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు

TTD EO Shyamala Rao : తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
X

తిరుమలలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు విస్తృత తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణి, బంగారు డాలర్ల విక్రయ కౌంటర్, అగరబత్తి, కొబ్బరికాయలు విక్రయ కౌంటర్లు, పబ్లికేషన్ స్టాళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టాళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ సజావుగా సాగుతున్నప్పటికీ కొబ్బరికాయల కౌంటర్ వద్ద సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం కారణంగా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story