TTD : గరుడాద్రి వద్ద సరికొత్త లైటింగ్.. లుక్కు మార్చేస్తున్న టీటీడీ

TTD : గరుడాద్రి వద్ద సరికొత్త లైటింగ్.. లుక్కు మార్చేస్తున్న టీటీడీ
X

శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టీటీడీ అధికారులు సప్తగిరుల సుందరీకరణకు అధికప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా తిరుమల నుండి తిరుపతికి వెళ్ళే మొదటి ఘాట్ రోడ్ లోని చివర్లో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణులు వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఇది ముందే నిర్ణయించిన ప్రాజెక్టు అయినప్పటికీ కొన్ని కారణాల వలన లేట్ జరిగింది. కొత్త ప్రభుత్వం, టీటీడీ కొత్త ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆదేశాలతో ఈ పనులు పట్టాలెక్కాయి. ట్రయిల్ రన్ క్రింద 6 ఫోకస్ లైట్ లను వినాయక స్వామి ఆలయం వద్ద సిబ్బంది ఏర్పాటు చేసారు. దీంతో గరుడాద్రి పర్వత శ్రేణులు విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోతున్నాయి.

Tags

Next Story