TTD : దివ్య వృక్షాల ప్రాజెక్టు.. టీటీడీ గొప్ప నిర్ణయం..

TTD : దివ్య వృక్షాల ప్రాజెక్టు.. టీటీడీ గొప్ప నిర్ణయం..
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత... భక్తుల మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసిపి పాలనలో తిరుమల క్షేత్రంలో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. కల్తీ లడ్డు, పరకామణి, పట్టు శాలువాల లాంటి కుంభకోణాలు మాత్రమే కనిపించాయి. కానీ బీఆర్ నాయుడు గారు తిరుమల ప్రాముఖ్యతను పెంచే విధంగా ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు దివ్యవృక్షాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 100 ఎకరాల్లో ఈ దివ్య వృక్షాలను పెంచి ఆలయాల్లో ధ్వజ స్తంభాల కోసం తయారు చేయించబోతోంది టీటీడీ. ధ్వజస్తంభాల కోసం కేవలం ఒక్క చెట్టు కాండం మాత్రమే ఉపయోగించాలి అనేది సనాతన ధర్మ సూత్రం.

బిఆర్ నాయుడు గారు మొదటి నుంచి ఆగమన శాస్త్రాల ప్రకారం టీటీడీలో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టు కూడా అందులో భాగమే. ఆలయాల ముందు నిలిపే ధ్వజ స్తంభాలు ఈ దివ్యవృక్షాల నుంచే తీసుకోవాలి అనేది ఈ శాస్త్రాల ఉద్దేశం. దివ్య వృక్షాల ప్రాజెక్టు..టేకు, ఇండియన్ కినో, టెర్మినెలియా, షోరియా అనే చెట్లను 100 ఎకరాల్లో పెంచబోతున్నారు బిఆర్ నాయుడు గారు. ఈ నిర్ణయంతో ఏడుకొండల్లో మరింత పచ్చదనం వెల్లివెరిసే అవకాశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఏడుకొండలు పచ్చదనం అన్ని కాలంలో కనిపించాలని కోరుకున్నారు.

అందుకు తగ్గట్టే బిఆర్ నాయుడు గారు పచ్చదనాన్ని పెంచుతూనే ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. వీటివల్ల టీటీడీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇతర ఆలయాల్లో మౌలిక వసతుల కోసం, అన్న ప్రసాదాల కోసం బిఆర్ నాయుడు గారు టీటీడీ నుంచి నిధులు కేటాయిస్తున్నారు. హిందూ ఆలయాల్లో వసతుల కల్పన కోసం టీటీడీ తరఫున బిఆర్ నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.


Tags

Next Story