TG : హుజూర్ నగర్‌లో ఉజ్జయిని నాగసాధువులు హల్చల్.. భస్మాభిషేకంతో అద్భుత పూజ

TG : హుజూర్ నగర్‌లో ఉజ్జయిని నాగసాధువులు హల్చల్.. భస్మాభిషేకంతో అద్భుత పూజ
X

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని NSP క్యాంపు ప్రాంగణంలో మహా శివునికి మహా రుద్రాభిషేకం, భస్మాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహేశ్వరుని 8 అడుగుల మట్టి శివలింగానికి 45 మంది నాగ సాధువులు జల, ఫల, పుష్ప, పంచామృతాలతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ మహా రుద్రాభిషేక మహోత్సవంలో శివ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకాన్ని తిలకించారు. శివనామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని.. హుజూర్ నగర్ లో నిర్వహించడంతో భక్తులు శివనామస్మరణలో మునిగి తేలారు.

Tags

Next Story