Union Minister : తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Union Minister : తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందజేసిన పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశ సరిహద్దుల్లో సైనికులు పట్టుదలతో పని చేస్తున్నారని.. దేశ సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలు, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి.

Tags

Next Story