TTD : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి.. సాధారణ దర్శనాలు మొదలు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తిఅయ్యాయి. నేటి నుంచి సాధారణ దర్శనలు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి 19 వరకు కొనసాగాయి. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 10 రోజల్లో 6లక్షలకుపైగా భక్తులకు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే వీలు కల్పించారు. ఆదివారం రాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి. కాగా 10 రోజుల్లో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
తిరుమల శ్రీవారికి ఆదివారం రాత్రి ఏకాంత సేవతో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభంకాగా.. ఈ నెల 19తో ముగిశాయి. మొత్తం 10 రోజుల్లో 6లక్షల 83వేల 304మంది తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో శ్రీవారి హుండీకి రూ.34.43 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే లక్షా 83వేల 132మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com