Bhadrachalam : భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

Bhadrachalam : భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
X

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామి దర్శనం ఇస్తున్నారు. గోదావరిలో గురువారం లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల అచంచల విశ్వాసం.

Tags

Next Story