TTD : తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. దీపావళి స్పెషల్ ఇదే

TTD : తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. దీపావళి స్పెషల్ ఇదే
X

తిరుమల వెళ్లే వీఐపీలకు ముఖ్య గమనిక. దీపావళి పండుగ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయనున్నారు. దీంతో, నేడు ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించడం లేదు.

తిరుమలలో నవంబర్ లో జరిగే కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.

Tags

Next Story