TTD : రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD : రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
X

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేసింది. జనవరి 10-19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 6న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక అటు ఇవాళ నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఇక 66,561 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 18, 647 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు… హుండీ ఆదాయం 3.98 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు ఉంటాయి. ప్రతీ మంగళవారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు ఉంటాయి.

Tags

Next Story