Maha Kumbh Mela : మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?

Maha Kumbh Mela : మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?
X

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి. కాగా త్రివేణి సంగమ క్షేత్రానికి భక్తులు తరలి వచ్చారు. నిన్న చివరి స్నానం (షాహీ స్నాన్) కావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల లోపు 41 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రయాగ్ రాజ్ డీఐజీ వైభవ్ కృష్ణ పర్యవేక్షణలో భారీ బందో బస్తు ఏర్పాటైంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా లో ఐదు పుణ్యస్నానాలతో నిన్నటితో ముగిసింది. 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 2న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘపౌర్ణమి, ఇవాళ మహాశివ రాత్రిని పురస్కరించుకొని ఐదు పుణ్యస్నానాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.

Tags

Next Story