Visakhapatnam : వారెవ్వా.. 7 కేజీల బంగారం.. రూ.5 కోట్ల కరెన్సీతో అమ్మవారిక అలంకరణ

Visakhapatnam : వారెవ్వా.. 7 కేజీల బంగారం.. రూ.5 కోట్ల కరెన్సీతో అమ్మవారిక అలంకరణ
X

విశాఖపట్నం నగరంలోని ఓల్డ్‌ టౌన్‌ పరిధిలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి 148 ఏళ్ల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణ కోసం భారీగా బంగారం, వెండి, కరెన్సీ నోట్లను ఉపయోగించారు.

అలంకరణలో అపురూప వైభవం 7 కిలోల బంగారు ఆభరణాలు మరియు బంగారు బిస్కెట్లు, 12 కిలోల వెండి వస్తువులు. సుమారు రూ. 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు.

ఈ అపురూపమైన అలంకరణలో మహాలక్ష్మి దేవి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story