Lord Ganesha Laddu : వినాయకుడి చేతిలో లడ్డు ఎందుకు పెడతారు?

Lord Ganesha Laddu : వినాయకుడి చేతిలో లడ్డు ఎందుకు పెడతారు?
X

గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొందరు విగ్రహాలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. గల్లీ గల్లీలో గణేష్ మండపాలను సిద్ధం చేశారు. సెప్టెంబర్ 7న చవిత సందర్భంగా మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. అప్పటి నుంచి నిమజ్జనం వరకు ప్రతి రోజు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. గణపతి దేవునికి ప్రీతిపాత్రమైన ప్రసాదాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.

ఇక, వినాయకుడి చేతిలో నైవేద్యంగా ఉంచే లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. నిమజ్జనం ముందు రోజు గణపతి లడ్డును వేలం పాట పాడతారు. ఈ లడ్డును దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు. అసలు.. వినాయకుడి చేతిలో నైవేద్యంగా లడ్డును ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు. వినాయకుడి చేతిలో లడ్డు పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందా...

అన్ని విఘ్నాలను దూరం చేసే గణేషుడికి లడ్డు ప్రసాదం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. వినాయక చవితి పర్వదినాన స్వామివారికి లడ్డులను నైవేద్యంగా సమర్పించి.. తమ కోరికలు విన్నవించుకుంటే.. అవి తీరుతాయని నమ్మకం.. అందుకే గణనాథుడికి లడ్డును ప్రసాదంగా సమర్పిస్తుంటారు. లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్న వారు ఇతరులకు పంచి పెట్టడంతోనూ చాచా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

Tags

Next Story