దెందులూరులో టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్?

దెందులూరులో టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్?
దెందులూరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారా? టీడీపీ నేతలను కించపరుస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారా? ఫేక్ పోస్టులు పెడుతుండటంతో టీడీపీ నేతల కుటుంబాల్లో అశాంతి నెలకొందా?

దెందులూరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారా? టీడీపీ నేతలను కించపరుస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారా? ఫేక్ పోస్టులు పెడుతుండటంతో టీడీపీ నేతల కుటుంబాల్లో అశాంతి నెలకొందా? బతికున్న వారిని చనిపోయారంటూ ట్రోల్ చేస్తున్నారా? ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదా?

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి మరింత శృతి మించి మానవత్వం మరిచిపోయోలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెదవేగి మండలం టీడీపీ అధ్యక్షుడు బొప్పన సుధ గుండెపోటుతో మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం నియోజకవర్గం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఫేస్ బుక్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కొంతమంది వ్యక్తులు అసభ్యకర పోస్టులు పెడుతుండటంతో టీడీపీ నేతల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి మమ్మల్ని రెచ్చగొడుతున్నారని, మేము ఏదైనా మాట్లాడితే మమ్మల్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేతగాని తనం వల్ల సోషల్ మీడియాలో సంఘవిద్రోహశక్తులు పేట్రేగిపోతున్నారని,మాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి అంతు తేలుస్తానంటూ చింతమనేని హెచ్చరించారు.

అయితే సోషల్ మీడియాలో తమపై కూడా అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, స్థానిక వైసీపీ నేతలు. దెందులూరు లో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక కొంతమంది కావాలనే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు

తమను రాజకీయంగా ఎదుర్కోలేకే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి తమను అప్రదిష్ట పాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మానవత్వం మరిచి బతికున్న వారికి శ్రద్ధాంజలి అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఎంతవరకు సబబని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story