Political Debate: బీజేపీ, వైసీపీల ప్లాన్- బి 'బీఆరెస్"!?
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకం రాష్ట్రంలో కాపుల్లో చీలిక తెచ్చేందుకు జగన్-కేసీఆర్ వ్యూహమంటూ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయన వ్యాఖ్యానించారు. అయన కామెంట్ కు ముందే ఇదే తరహా అభిప్రాయాలు ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా చర్చలో ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో భారీ ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఆ సామాజిక వర్గం వారు ప్రస్తుత అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను కొనసాగించకపోవడం, కోనసీమలో జిల్లా పేరు మార్పు తదిత అంశాల్లో జగన్ తమకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. అందుకే సంఖ్యాపరంగా అధికంగా వుండే వారి ఓట్లు ఈసారి ఏకమొత్తంలో తనకు వ్యతిరేకంగా పడితే అధికారం ఊడటం గ్యారెంటీ.
గత ఎన్నికల్లో జగన్ పక్షాన నిలిచిన కాపులు ఈసారి కలిసివచ్చేలా కనపడటంలేదు., పవన్ కళ్యాణ్ జనసేన ,టీడీపీ ల వైపు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అటు మాజీ మంత్రి రావేల కిషోర్ తో ఆయన సామాజికవర్గం ఓట్లు సైతం బీఆర్ఎస్ కు వెళ్లితే.. ప్రతిపక్ష ఓటు చీలితే బయటపడవచ్చన్న ధీమాలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది,అందకే జగన్ తన మిత్రుడు కేసీఆర్ సాయం పొందుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధిగా వున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఓట్లు చీల్చేందుకు బీఆరెస్ కమలం పార్టీకి బీ టీం గా వ్యవహరిస్తోందన్న విమర్శలూ వున్నాయి. కర్నాటకలో జేడీఎస్ కుమారస్వామీ తో జట్టు కట్డడం ద్వారా అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కు గండిపడితే ..అది బీజేపీ కి లాభిస్తోందన్న వాదన ఉంది..అలాగే కేరళలో సీపీఎం పార్టీతో కలిసివెళ్తే ..అక్కడ కాంగ్రెస్ ను నిలవరించవచ్చు.. మహారాష్ట్ర లో ఉద్దవ్ ఠాక్రే, జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ , యూపీలో అఖిలేష్ ఇలా కాంగ్రెస్ తో కలిసినడిచే వాళ్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చడమే నని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
అయితే ఏపీలో 2019లో అంతర్గత సహాయం చేసిన కేసీఆర్ ..ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా మేలు చేకూర్చబోతున్నారంటూ ఏపీ నేతలు విమర్శిస్తున్నారు.. కేఏపాల్ లాగా బీఆర్ఎస్ సైతం ఏపీలో 175 స్థానాలు పోటి చేయవచ్చని విమర్శలు చేస్తున్నా.. వైసీపీ నేతలు తమకు కాపు ఓట్లు చీల్చితే లాభమేనన్న ధీమా కనపడుతోంది.... చూడాలి బీజేపీ, వైసీపీ కి బీ- టీంగా ఉంటుందా.... దేశంలో జెండా ఎగురవేస్తుందా ...
- మార్గం శ్రీనివాస్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com