Promotions at Accenture : యాక్సెంచర్ లో 50 వేల మందికి ప్రమోషన్లు

ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 50 వేల మందికి ప్రమోషన్లు ఇవ్వనుంది. భారత్లో ఉన్న వారిలో 15 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వనుంది. కన్సల్టింగ్ సేవలకు డిమాండ్ తగ్గడంతో ప్రమోషన్లను ఆరు నెలల వాయిదా వేసింది. ఉద్యోగుల్లో విశ్వాసం పెంచి, మనో ధైర్యాన్ని ఇవ్వడానికి జూన్లో ప్రమోషన్లు ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
ఇండియాలో 15 వేలు, యూరప్ లో 11 వేలు, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 11 వేలు, అమెరికాల 10 వేల మందికి ప్రమోషన్లు ఇవ్వనుంది. ప్రస్తుతం యాక్సెంచర్లో ప్రపంచ వ్యాప్తం గా 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందికి జూన్లో ప్రమోషన్లు ఇవ్వనుంది. ప్రమోషన్లతో కీలక విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బేసే పెరుగుతుంది. బోనస్, పనితీరు ఆధారిత ఈక్విటీపై డిసెంబర్లో నిర్ణయం తీసుకోనున్నట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. కొవిడ్ సమయలో ఐటీ సేవలకు వచ్చిన డిమాండకు అనుగుణంగా యాక్సెంచర్ కూడా ఇతర కంపెనీల తరహాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడంతో 2023లో 19 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com