AP : చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..!

AP : చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..!

టీడీపీ అధినేత చంద్రబాబుతో జననేసాని పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్‌.. ఆయనతో సమావేశమయ్యారు. ఏపీలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు - పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. గతంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు పవన్‌కల్యాణ్‌. విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో మరోసారి పవన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని నాడు ప్రకటించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా వారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు-పవన్‌ భేటీ కావడం ఇది మూడోసారి. ఇక.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడే అంశంపై కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల పర్యటనలో వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ అరాచకాలను ఎండగడుతున్నారు.

Tags

Next Story