Heavy Rains : బిగ్ అలెర్ట్.. నేడు భారీ వర్షాలు

Heavy Rains : బిగ్ అలెర్ట్.. నేడు భారీ వర్షాలు
X

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ లోని ములుగు, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇవాళ కృష్ణా, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వర్షాలు కురిసినట్లు APSDMA తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు రెయిన్స్ పడతాయని పేర్కొంది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Next Story