Bird Flu Fear : బర్డ్ ఫ్లూ భయం.. రూ.150కే కేజీ చికెన్

ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ రేటు రూ.150కి పడిపోయింది. ఏపీలోని తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని ఆదేశించారు.
బర్డ్ ఫ్లూ అంటే?
బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com