Bird Flu Impact : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ సేల్స్

ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో సేల్ 50% తగ్గిందని వ్యాపారులు తెలిపారు. తెలంగాణ లో వైరస్ వ్యాప్తి లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం వల్ల జనం భయందోళన చెందుతున్నారని అంటున్నారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. మూడ్రోజుల క్రితం వరకు రోజుకూ సరాసరిన 200 కేజీల వరకు చికెన్ విక్రయించే దుకాణాల్లో ఇప్పుడు 50 నుంచి 100 కేజీల లోపే విక్రయాలు సాగుతున్నాయని అంటున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తాము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు. చికెన్‌ను 70 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని.. కోళ్లు, ఇతర పక్షుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందని చెబుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com