Car Accident : శునకాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన కారు..

Car Accident : శునకాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన కారు..
X

కౌతాళం మండలం ఎరిగేర సమీపంలోని ఎల్ ఎల్ సీ కాలువలోకి కారు దూసుకెళ్లి న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ కి చెందిన సునీల్, మణికంఠ, హపయ్య, మంజునాథ్, అవినాష్, ఐదర్ ఆరుగురు స్నేహితులు కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనంకు వచ్చి తిరుగు ప్రయాణం లో హుబ్లీకి కారులో వెళ్తుండగా కౌతాళం మండలం ఎరిగేర సమీపంలోని ఎల్ ఎల్ సీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు దిగి కారులో ఉన్న హపయ్య, మంజునాథ్, అవినాష్, ఐదర్ లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సునీల్(21), మణికంఠ (22) కాలువ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొంత దూరం కట్టుకుని పోయి మృత దేహలుగా తేలారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు.

Tags

Next Story