WhatsApp : వాట్సప్ లో చాట్ జీపీటీ.. ఇలా యూజ్ చేయండి

WhatsApp : వాట్సప్ లో చాట్ జీపీటీ.. ఇలా యూజ్ చేయండి
X

మైక్రోసాఫ్ట్ మద్దతు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్ ప్లాట్ ఫామ్ ఓపెన్ ఏఐ కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చింది. 12 డేస్ ఆఫ్ ఓపెన్ ఏఐ అనౌన్స్ మెంట్ లో భాగంగా తన ఏఐ చాట్ బాట్ చాటిజీపీటీని వాట్సప్ లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. వేరే యాప్ అకౌంట్లో పనిలేకుండదా నేరుగా వాట్సప్ లోనే చాట్ జీపీటీని వినియోగించవచ్చు. ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది. భారత్ లోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇందుకు ప్లస్ 1800 2428478 నెంబర్ ను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ ను ఇండియాలోనూ వినియోగించవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం చాటే పీటీ సేవలు పొందాలంటే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరంలేదు. రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. ఈ పరిమితి పూర్తయ్యే సమయానికి నోటిఫికేషన్ వస్తుంది.

Tags

Next Story