Mega Brothers Wishes : లోకేశ్‌కు చిరంజీవి, పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్

Mega Brothers Wishes : లోకేశ్‌కు చిరంజీవి, పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్
X

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సమానులైన లోకేశ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని చిరు పేర్కొన్నారు.

మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి విషెస్ తెలిపారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు WEFలో పాల్గొంటున్న నీకు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ నానా’ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు. ‘నాపై మీ ప్రేమ, అంకితభావానికి కృతజ్ఞురాలిని. మన రాష్ట్రం తరఫున WEFలో రిప్రజెంట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే లవ్ ఆఫ్ మై లైఫ్’ అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.

Tags

Next Story