Deepfakes : మెటా కీలక నిర్ణయం .. డీప్ ఫేక్ పట్టేద్దాం ఇలా!

డీప్ ఫేక్ ల (Deep Fake) బెడద ఎక్కువవుతున్న తరుణంలో మెటా (Meta) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమా చారాన్ని అరికట్టేందుకు వాట్సప్ లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తున్నామని తెలిపింది. 'మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ)'తో ఇందుకోసం భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపింది.
మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులో కి వస్తుంది. ఈ హెల్ప్ లైన్ సాయంతో ఎం సీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్టికర్లు, పరిశోధన సంస్థలు వైరలవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్ ఫేక్ లను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సప్ చాట్ బాట్ ను సంప్రదించి డీప్ ఫేక్ లపై సమాచారాన్ని పొందొచ్చని పేర్కొంది.
హెల్ప్ లైన్ ద్వారా వచ్చే మెసేజ్ ల నిర్వహణ కోసం ఎంసీఏ ప్రత్యేకంగా 'డీప్ ఫేక్ అనాలసి స్ యూనిట్ ' నెలకొల్పుతుందని తెలిపింది. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే వాట్సప్ హెల్ప్ లైన్ ముఖ్య ఉద్దేశమని మెటా వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com