Chennai Airport Closed : ఫెంగల్ ఎఫెక్ట్ .. చెన్నయ్ ఎయిర్ పోర్ట్ బంద్

ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువావూర్లో భారీ వర్షాలు కురుస్తున్నా యి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. జనజీవనం ఎక్కడిక క్కడ స్తంభించిపోయింది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా చెన్నయ్ ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రేణిగుంట విమా నాశ్రయం నుంచి బయల్దేరే నాలుగు ఫ్లయి ట్లను రద్దు చేశారు. తమిళనాడులోని ఈస్ట్ కోస్ట్ రోడ్, పాత మహాబలిపురం రోడ్ సహా కీలక రహదారులపై ప్రజా రవాణా సేవలను నిషేధించింది. చెన్నైలో అండర్పెస్లను అధికారులు మూసివేశారు. నైరుతి బంగా ళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న మధ్యాహ్నం తుపానుగా మారింది. పశ్చిమవాయవ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి కారైకాల్ (పుదుచ్చేరి), మహా బలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంబడి గరి ష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. దీని ప్రభా వంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు బార్డర్ లోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధి కారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com