Telugu States CMs : సీఎంలుగా తొలిసారి కలుసుకున్న చంద్రబాబు, రేవంత్.. ఫొటో వైరల్

Telugu States CMs : సీఎంలుగా తొలిసారి కలుసుకున్న చంద్రబాబు, రేవంత్.. ఫొటో వైరల్
X

తెలుగు రాష్ట్రాల సీఎంలను దావోస్‌ పర్యటన కలిపింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంత్రులతో కలిసి వెళ్లిన సీఎంలు దావోస్‌లో కలుసుకున్నారు. జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిత్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, శ్రీధర్ బాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

Tags

Next Story