Former Cricketer Rajagopal : మాజీ క్రికెటర్ రాజగోపాల్ కన్నుమూత

Former Cricketer Rajagopal : మాజీ క్రికెటర్ రాజగోపాల్ కన్నుమూత
X

ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర(94) కన్నుమూశారు. తిరుపతి(D) వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన ఈయన 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చి జట్టుతో మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. బ్యాటింగ్, లెగ్ స్పిన్‌తో గుర్తింపు తెచ్చుకున్న యాచేంద్ర మొత్తం 15 రంజీ మ్యాచ్‌లు ఆడారు. 1963-65 మధ్య ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహించారు. కుడి చేతి వాటం బ్యాటర్‌గానే రాణిస్తూ ఆయన స్పిన్‌తో వికెట్లు పడగొట్టేవారు. రాజగోపాల్‌ తాను ఆడటమే కాకుండా ఆంధ్రలో ఎంతోమంది క్రికెటర్లను తయారు చేశారు. రాజగోపాల్‌ కేవలం ఒక క్రికెటర్ గానే కాకుండా ఓ టెన్నిస్‌ క్రీడాకారుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతిపై ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతేకాదు.. యచేంద్ర మృతి వార్త తెలిసిన క్రికెట్ అభిమానులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన గేమ్‌ను గుర్తుకుచేసుకుంటున్నారు.

Tags

Next Story