Google Maps : గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇక వాట్సాప్ అక్కర్లేదు

Google Maps : గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇక వాట్సాప్ అక్కర్లేదు

Google Maps : ప్రదేశాలకు వెళ్లాలన్నా, షార్ట్కట్ రూట్స్ లలో ప్రయాణించాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్స్. అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ తన సేవలన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకు వచ్చిన గూగుల్ మ్యాప్స్ తాజాగా లాక్ స్క్రీన్ పైనే లొకేషన్ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. సాధారణంగా గూగుల్ మ్యాప్స్ మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం షార్ట్కట్లు కనిపిస్తాయి.

కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ తో మొబైల్ లాక్ స్క్రీన్పై ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ ఎరివల్ (ఈటీఏ) వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్ మ్యాప్స్ వినియోగిం చాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేయా ల్సిన అవసరంలేదు. అలాగే ఏదైనా లొకేషన్ కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే స్టార్ట్బటన్ క్లిక్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒక వేళ వేరే రూట్లో ప్రయాణిస్తుంటే ఆటోమేటిక్ గా రూట్ అప్డేట్ అవుతుంది.

గూగుల్ మ్యాప్స్ గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్ ఆఫ్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. అందు లో కనిపించేసెట్టింగ్స్ నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ తీసుకు వచ్చిన కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story