Starlink : ఇంటర్నెట్ సేవలకు స్టార్ లింక్ కు గ్రీన్ సిగ్నల్

దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ను టెలికం విభాగం (డాట్) జారీ చేసింది. దీంతో ఈ లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. యులెల్సాట్ వన్ వెబ్, రిల యనస్ జియో ఇప్పటికే లైసెన్స్ పొందాయి. దరఖాస్తు చేసు కున్న 15-20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తా మని డాట్ వర్గాలు తెలిపాయి. ఎలాన్ మస్క్ కు చెందిన ఉండే స్పేస్ఎక్స్ అనుబంధ సంస్థ వివిధ దేశాల్లో ఎర్త్ గ్రహాల ద్వారా సంప్రదాయ ఉపగ్రహ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో స్టార్అంక్కు చెందిన 6000 ఉపగ్రహాలు పరిభ్ర మిస్తుంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూ రంలో ఉండటం వల్ల ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్ ఉపయోగపడుతుంది. మారుమూల ప్రాంతాలు, కొంత ప్రాంతాల్లో కూడా దీని వల్ల ఇంటర్నెట్ సేవలు అం దించవచ్చు. దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఇప్పటికే స్టార్ లింక్తో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఒప్పందం చేసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com