Srisailam : ఏకధాటిగా వర్షాలు .. శ్రీశైలానికి భారీ వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. జూరాల, తుంగభద్ర డ్యాం ల నుంచి ఇన్ ఫ్లో ఉంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్ పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. ఎగువ నుంచి 1,62,529 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ విద్యుత్ ఉత్ప త్తికేంద్రాల గుండా పవర్ జనరేషన్ స్టార్టయింది. దీంతో 54,191 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ వైపు తరలి వెళ్తేది. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70 అడుగుల మేర నీళ్లున్నాయి. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం 191.6512 టీఎంసీల నీళ్లున్నాయి. దీంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిపుణుడు కన్నయ్య నాయుడు దెబ్బతిన్న 10 నంబర్ గేట్ ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే అయిదు సంవత్సరాల్లో రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి మార్చుకోవాలని సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com