నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వైభవంగా..

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. ఈ విశేషాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ రోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే పరమశివుడిని దర్శించుకుంటారు.
ఫిబ్రవరి 23న ఏపీ సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి రోజువారీ చేసే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. 11 రోజుల ఉత్సవాల అనంతరం యధావిధిగా ఆర్జిత సేవలు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com