Mahatma Gandhi Granddaughter : మహాత్మా గాంధీ ముని మనవరాలు కన్నుమూత

Mahatma Gandhi Granddaughter : మహాత్మా గాంధీ ముని మనవరాలు కన్నుమూత
X

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. నీలం బెన్ అంతిమ యాత్ర ఏప్రిల్ 2న ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్ ఇంటి నుండి ప్రారంభమై వెరావల్ శ్మశానవాటిక వరకు సాగింది. ఆమె మరణంతో సమాజం నిజమైన, నిస్వార్థ సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని కోల్పోయిందని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Next Story